Main Menu

Amta Neeku Vedukaite (అంత నీకు వేడుకైతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1813 | Keerthana 70, Volume 28

Pallavi:Amta Neeku Vedukaite (అంత నీకు వేడుకైతే)
ARO: Pending
AVA: Pending

Ragam:Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత నీకు వేడుకైతే నట్టే వెండ్లాడరాదా
ఇంతి సిగ్గులు రచ్చనేల వేసేవు     ॥ పల్లవి ॥

కాటుక కన్నుల నిన్నుఁ గాఁడఁ జూచెనంటాను
ఆఁటదానినేల నీవు అద్దలించేవు
గాఁటపుగుబ్బలు చూపీ గబ్బితనాన నంటాను
నీటున నీకెపైనేల నెపాలు వేసేవు    ॥ అంత ॥

నిక్కి మోవినే మాటాడి నిన్ను నోరూరించెనంటా
గక్కన మానినినేల కాకు సేసేవు
చక్కఁదనములు చూపి చవులు వుట్టించెనంటా
చిక్కించుక గోరనేల చిమ్మవచ్చేవు    ॥ అంత ॥

మలసి నీముతరను మనసు గరఁచీనంటా
కలికి నెంతేసి బిగ్గెఁ గాఁగిలించేవు
యెలమి శ్రీవేంకటేశ యేలితి వీవనితను
నలిరేఁగి యెంతవడి నవ్వులు నవ్వేవు   ॥ అంత ॥

Pallavi

Anta nīku vēḍukaitē naṭṭē veṇḍlāḍarādā
inti siggulu raccanēla vēsēvu

Charanams

1.Kāṭuka kannula ninnum̐ gām̐ḍam̐ jūcenaṇṭānu
ām̐ṭadāninēla nīvu addalin̄cēvu
gām̐ṭapugubbalu cūpī gabbitanāna naṇṭānu
nīṭuna nīkepainēla nepālu vēsēvu

2.Nikki mōvinē māṭāḍi ninnu nōrūrin̄cenaṇṭā
gakkana mānininēla kāku sēsēvu
cakkam̐danamulu cūpi cavulu vuṭṭin̄cenaṇṭā
cikkin̄cuka gōranēla cim’mavaccēvu

3.Malasi nīmutaranu manasu garam̐cīnaṇṭā
kaliki nentēsi biggem̐ gām̐gilin̄cēvu
yelami śrīvēṅkaṭēśa yēliti vīvanitanu
nalirēm̐gi yentavaḍi navvulu navvēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.