Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 401 | Keerthana 3 , Volume 12
Pallavi: Ana Lela Pettukone Vappati Neevu (ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు)
ARO: Pending
AVA: Pending
Ragam:Samantham
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు
లోనై నే నీ కుండితే లోకమైనా మెచ్చునా ॥ పల్లవి ॥
మచ్చికతో నాపె యింట మాపు దాఁ కా నుండి వచ్చి
నచ్చుల నా మన నెట్టు నమ్మించేవు
అచ్చపు మగవాఁ డవు అంగనతో నొంటి నుంటే
నెచ్చెలులైనా నిన్ను నింద లాడకుందురా ॥ అన ॥
చేతులార నాపె చేత సేవ సేయించుకొంటానే
నాతో నిజా లెట్టు నడపించేవు
రాతి రొక్కమంచముపై రామా నీవు నుంటి రంటే
ఆతలీతలివారలు ఆడుకోక వుందురా ॥ అన ॥
గౌరవించే నంటా నాఁ పెఁ గౌఁగిలించుకొంటానే
యేర శ్రీ వేంకటేశ నా కెట్టు బొంకేవు
సారె నలమేల్మంగను సరికి సరిఁ గూడితి
వీ రీతికిఁ బొరుగువా రిటు నవ్వకుందురా. ॥ అన ॥
Pallavi
Āna lēla peṭṭukonē vappaṭi nīvu
lōnai nē nī kuṇḍitē lōkamainā meccunā
Charanams
1.Maccikatō nāpe yiṇṭa māpu dām̐ kā nuṇḍi vacci
naccula nā mana neṭṭu nam’min̄cēvu
accapu magavām̐ ḍavu aṅganatō noṇṭi nuṇṭē
neccelulainā ninnu ninda lāḍakundurā
2.Cētulāra nāpe cēta sēva sēyin̄cukoṇṭānē
nātō nijā leṭṭu naḍapin̄cēvu
rāti rokkaman̄camupai rāmā nīvu nuṇṭi raṇṭē
ātalītalivāralu āḍukōka vundurā
3.Gauravin̄cē naṇṭā nām̐ pem̐ gaum̐gilin̄cukoṇṭānē
yēra śrī vēṅkaṭēśa nā keṭṭu boṅkēvu
sāre nalamēlmaṅganu sariki sarim̐ gūḍiti
vī rītikim̐ boruguvā riṭu navvakundurā.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.