Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1516 | Keerthana 92 , Volume 25
Pallavi: Andu Kemidosamu Aanatiyyagadavayyaa (అందు కేమిదోసము ఆనతియ్యగదవయ్యా)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందు కేమిదోసము ఆనతియ్యఁ గదవయ్య
యిందరి నీవేలేది యెఱఁగమా యెపుడు ॥ పల్లవి ॥
బోన మాయితము సేసి పొలిఁతి విలువఁగాను
ఆనాతినే విడె మడిగేవు
పూని యేడనైనా నీవు బోజనము సేసితివో
యేనెలఁతవిఁ(విం?) దైవా నియ్యకొంటివో ॥ అందు ॥
కంచముపట్టుసేసి కాంత గూచుండు మనఁగా
మంచినీళ్లిమ్మనేవు మఱి నాపెనే
అంచెలఁ బిండిపంటలే యారగించి వచ్చితివో
పొంచి యెవ్వతైనా వొక్కపొద్దు చెప్పెనో ॥ అందు ॥
కలవెల్లా వడ్డించి కడి యెత్తు మనఁగాను
అలమి మోవితేనియ లడిగేవు
యెలమి శ్రీవేంకటేశ యేకారము నంజితివో
నెలవై నన్నుఁ గూడితి నీకు నిదేప్రియమో ॥ అందు ॥
Pallavi
Andu kēmidōsamu ānatiyyam̐ gadavayya
yindari nīvēlēdi yeṟam̐gamā yepuḍu
Charanams
1.Bōna māyitamu sēsi polim̐ti viluvam̐gānu
ānātinē viḍe maḍigēvu
pūni yēḍanainā nīvu bōjanamu sēsitivō
yēnelam̐tavim̐(viṁ?) Daivā niyyakoṇṭivō
2.Kan̄camupaṭṭusēsi kānta gūcuṇḍu manam̐gā
man̄cinīḷlim’manēvu maṟi nāpenē
an̄celam̐ biṇḍipaṇṭalē yāragin̄ci vaccitivō
pon̄ci yevvatainā vokkapoddu ceppenō
3.Kalavellā vaḍḍin̄ci kaḍi yettu manam̐gānu
alami mōvitēniya laḍigēvu
yelami śrīvēṅkaṭēśa yēkāramu nan̄jitivō
nelavai nannum̐ gūḍiti nīku nidēpriyamō
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.