Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
చేయి మీఁదవేసితివి సిగ్గులెల్లాఁ బాసితివి
ఆయనాయ నీకునడ్డమాడనయ్య
రాయడించే చోటుగాదు రతికెక్కినపుడైనా
చాయకుఁ దెచ్చుకో మాట చవులై నయపుడు ॥ అన్నే ॥
కన్నులనే నవ్వితివి కాఁగిటఁ గూడితివి
మిన్నకైనా నిన్ను సారె మెచ్చేనయ్య
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
వన్నెకుఁ దెచ్చుకో మాట వహికెక్కినపుడు ॥ అన్నే ॥
No comments yet.