Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.1536 | Keerthana 151 , Volume 25
Pallavi: Annitaa Jaanadainaadu (అన్నిటా జాణడైనాడు)
ARO: Pending
AVA: Pending
Ragam: Desalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నిటా జాణఁడైనాఁడు ఆలను నేను
పన్ని తన చిత్తము పట్టనెటు నేర్తునే ॥ పల్లవి ॥
యిచ్చకమాడఁగవలె ఇంతులకుఁ బతితోను
పచ్చిగా నవ్వఁగవలె పైకొనవలె
మచ్చరించరాదు మరి మంకులు చూపఁగరాదు
నిచ్చఁదనపొందుసేయ నేనెట్టు నేర్తునే ॥ అన్ని ॥
వూడిగము సేయవలె వొద్దికతో విభునికి
వేడుక సేయఁగవలె విడె మీవలె
పాడిపంతా లెంచరాదు బలిమిఁ దోయఁగరాదు
జాడమీరి తను నెట్టు జరయఁగనేర్తునే ॥ అన్ని ॥
చెనకఁగవలె తానె శ్రీవేంకటేశుఁడు రతిఁ
బెనఁగవలె కాఁగిట బెరయవలె
గునియఁగరా దెఁ(దెం?) తైనా గుట్టు నరపఁగరాదు
మనసిచ్చి నన్ను నేలె మాన నెట్టు నేర్తునే ॥ అన్ని ॥
Pallavi
Anniṭā jāṇam̐ḍainām̐ḍu ālanu nēnu
panni tana cittamu paṭṭaneṭu nērtunē
Charanams
1.Yiccakamāḍam̐gavale intulakum̐ batitōnu
paccigā navvam̐gavale paikonavale
maccarin̄carādu mari maṅkulu cūpam̐garādu
niccam̐danapondusēya nēneṭṭu nērtunē
2.Vūḍigamu sēyavale voddikatō vibhuniki
vēḍuka sēyam̐gavale viḍe mīvale
pāḍipantā len̄carādu balimim̐ dōyam̐garādu
jāḍamīri tanu neṭṭu jarayam̐ganērtunē
3.Cenakam̐gavale tāne śrīvēṅkaṭēśum̐ḍu ratim̐
benam̐gavale kām̐giṭa berayavale
guniyam̐garā dem̐(deṁ?) Tainā guṭṭu narapam̐garādu
manasicci nannu nēle māna neṭṭu nērtunē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.