Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1624 | Keerthana 139 , Volume 26
Pallavi: Antinaa Tannemainaa Naavaginjantainaa (అంటినా తన్నేమైనా నావగింజంతైనా)
ARO: Pending
AVA: Pending
Ragam: Aahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంటినా తన్నేమైనా నావగింజంతైనా మాట
కంటిచూపు తాఁ జూచె కన్నలలో నున్నవి (ది?) ॥ పల్లవి ॥
ఆయలేవే తనమాట కందాలు చెప్పఁగవచ్చీ
చాయసేసుకొన్నఁ బోఁడు సాదించీని
చేయారఁ దనమేనిచిన్న లివె చేనిపంట
కోయిలకాలే చెప్పీఁ గోప మేఁటికనవే ॥అంటి ॥
పోనీవే తనుఁదానె పొగడీఁ దన నిజము
మానేనన్నాఁ బోనీఁడు మళ్లఁదీసీని
అనలేలే తనగుణ మదె గొండంటి మెత్తన
నానఁగానే కానవచ్చీ నయమైతేఁగనక ॥ అంటి ॥
కద్దులేవే తనకాఁక కాఁగిటనే చూపవచ్చీ
వొద్దన్నా మానఁడు నాపై వొళ్లు వేసీని
వొద్దికె శ్రీవేంకటేశుఁ డొనగూడె తననేర్పు
తిద్దనేల నీరుకొలఁది తామెర గాదా ॥ అంటి ॥
Pallavi
Aṇṭinā tannēmainā nāvagin̄jantainā māṭa
kaṇṭicūpu tām̐ jūce kannalalō nunnavi (di?)
Charanams
1.Āyalēvē tanamāṭa kandālu ceppam̐gavaccī
cāyasēsukonnam̐ bōm̐ḍu sādin̄cīni
cēyāram̐ danamēnicinna live cēnipaṇṭa
kōyilakālē ceppīm̐ gōpa mēm̐ṭikanavē
2.Pōnīvē tanum̐dāne pogaḍīm̐ dana nijamu
mānēnannām̐ bōnīm̐ḍu maḷlam̐dīsīni
analēlē tanaguṇa made goṇḍaṇṭi mettana
nānam̐gānē kānavaccī nayamaitēm̐ganaka
3.Kaddulēvē tanakām̐ka kām̐giṭanē cūpavaccī
voddannā mānam̐ḍu nāpai voḷlu vēsīni
voddike śrīvēṅkaṭēśum̐ ḍonagūḍe tananērpu
tiddanēla nīrukolam̐di tāmera gādā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.