Main Menu

Anuchu Munulu Rushu (అనుచు మునులు ఋషు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 342 | Keerthana 249 , Volume 4

Pallavi:Anuchu Munulu Rushu (అనుచు మునులు ఋషు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను
వినియు విననియట్టె వీడె యాడీఁ గాని  ॥ పల్లవి ॥

ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు
అకటా నందునికొడుకాయఁగాని
శకుంతగమనుఁ డితడు సర్వేశుఁ డితఁడు
వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని      ॥ అను ॥

వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుఁ డితఁడు
కాదనలేక పసులఁ గాచీఁగాని
ఆదిమూల మితఁడు యమరవంద్యుఁ డితఁడు
గాదిలిచేఁతల రోలఁ గట్టువడెఁగాని    ॥ అను ॥

పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని
హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని    ॥ అను ॥

Pallavi

Anucu munulu r̥ṣu lantaninta nāḍam̐gānu
viniyu vinaniyaṭṭe vīḍe yāḍīm̐ gāni

Charanams

1.Mukundum̐ ḍitam̐ḍu muraharum̐ ḍitam̐ḍu
akaṭā nandunikoḍukāyam̐gāni
śakuntagamanum̐ ḍitaḍu sarvēśum̐ ḍitam̐ḍu
vekali rēpallevīdhi viharin̄cīm̐gāni

2.Vēdamūriti itam̐ḍu viṣṇudēvum̐ ḍitam̐ḍu
kādanalēka pasulam̐ gācīm̐gāni
ādimūla mitam̐ḍu yamaravandyum̐ ḍitam̐ḍu
gādilicēm̐tala rōlam̐ gaṭṭuvaḍem̐gāni

3.Paramātmum̐ ḍitam̐ḍē bālum̐ḍai vunnām̐ḍugāni
hari yītam̐ḍē vennamuccāyam̐gāni
paraga śrīvēṅkaṭādripatiyunu nītam̐ḍe
tiramai golletalacēm̐ diṭṭuvaḍīm̐gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.