Main Menu

Iddari bavamulunu (ఇద్దరి భావములును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 419

Copper Sheet No. 171

Pallavi: Iddari bavamulunu (ఇద్దరి భావములును)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె |
అడ్డుకొని తులదూగినట్టి చందమాయెను ||

Charanams

|| తళుకున నీవిప్పుడు తరుణి జూచితేను |
తొలకి చెక్కుచెమట దొరుగ జొచ్చె |
లలి మీరి ఆమెరుపులకు యీ తురుము మేఘ- |
మలరి వాన గురిసినట్టి చందమాయెను ||

|| చదురుమాటల నీవు జలజాక్షి బిలిచితే |
పొదిగొని నిలువెల్ల బులకించెను |
కదిసి ఆమాటల గాలికి యీమైదీగె |
అదనుగూడ ననిచినట్టి చందమాయెను ||

|| ననుపై శ్రీ వేంకటేశ నవ్వి నీవు గూడితేను |
యెనసి కామిని చిత్తమెల్ల గరగె |
వొనరి ఆ వెన్నెల కీ మనసనే చంద్రకాంత |
మనువుగా గరగినయట్టి చందమాయెను ||

.

Pallavi

|| iddari BAvamulunu yIDujOLLAya nide |
aDDukoni tuladUginaTTi caMdamAyenu ||

Charanams

|| taLukuna nIvippuDu taruNi jUcitEnu |
tolaki cekkucemaTa doruga jocce |
lali mIri Amerupulaku yI turumu mEGa- |
malari vAna gurisinaTTi caMdamAyenu ||

|| cadurumATala nIvu jalajAkShi bilicitE |
podigoni niluvella bulakiMcenu |
kadisi AmATala gAliki yImaidIge |
adanugUDa nanicinaTTi caMdamAyenu ||

|| nanupai SrI vEMkaTESa navvi nIvu gUDitEnu |
yenasi kAmini cittamella garage |
vonari A vennela kI manasanE caMdrakAMta |
manuvugA garaginayaTTi caMdamAyenu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.