Main Menu

Imdukedi vupaya (ఇందుకేది వుపాయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.150

Copper Sheet No. 326

Pallavi:Imdukedi vupaya (ఇందుకేది వుపాయ)

Ragam: Desaksi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇందుకేది వుపాయ మోయిశ్వర నీకే తెలుసు
మందలించ నశక్తుఁడ మరి నీదాసుఁడను

చరణములు

1.ధీరుఁడనై ధరలోన దేహము నే మోచితి
కోరి పుణ్యపాపాలకు గురియు నైతి
పూరట యేమిటా లేదు వోపనని మానరాదు
తీరదు భోగించక దినదినకర్మము

2.గరిమ సంసారినైతి కంటిఁ బెక్కుసుతులను
యిరవుగఁ గట్టుకొంటి నీలంపటాలు
వెర వేమీ నెరఁగను విడువ వెంతైనాను
హరిహరి రాచినా సమయపు బలుకాంక్షలు

3.అట్టె గురుముఖమైతి నాతుమలో నినుఁ గంటి
జట్టిగొని నీపాదాలే శరణంటిని
గట్టిగా నలమేల్మంగకాంతుఁడ శ్రీవేంకటేశ
యిట్టె నిన్నెరఁగలేని దిన్నాళ్ళు నానేరమి
.


Pallavi

iMdukEdi vupAya mOyiSvara nIkE telusu
maMdaliMca naSaktu@mDa mari nIdAsu@mDanu

caranams

1.dhIru@mDanai dharalOna dEhamu nE mOciti
kOri puNyapApAlaku guriyu naiti
pUraTa yEmiTA lEdu vOpanani mAnarAdu
tIradu BOgiMcaka dinadinakarmamu

2.garima saMsArinaiti kaMTi@m bekkusutulanu
yiravuga@m gaTTukoMTi nIlaMpaTAlu
vera vEmI nera@mganu viDuva veMtainAnu
harihari rAcinA samayapu balukAMxalu

3.aTTe gurumuKamaiti nAtumalO ninu@m gaMTi
jaTTigoni nIpAdAlE SaraNaMTini
gaTTigA nalamElmaMgakAMtu@mDa SrIvEMkaTESa
yiTTe ninnera@mgalEni dinnALLu nAnErami
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.