Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 305 | Keerthana 26 , Volume 4
Pallavi:Amaramganalade (అమరాంగనలదె)
ARO: Pending
AVA: Pending
Ragam: Deva gandhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Amaramganalade | అమరాంగనలదె
Voice: Unknown
Amaramganalade | అమరాంగనలదె
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
అమరాంగన లదె యాడేరు
ప్రమదంబున నదె పాడేరు ॥ పల్లవి ॥
గరుడవాహనుఁడు కనకరథముపై
యిరవుగ వీధుల నేఁగీని
సురలును మునులును సొంపుగ మోఁకుల
తెరలిచి తెరలిచి తీసేరు ॥ అమ ॥
యిలధరుఁడదివో యింద్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలఁగి సేవలటు సేసేరు ॥ అమ ॥
అలమేల్మంగతొ నటు శ్రీవేంకట
నిలయుఁ డరదమున నెగడీని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మిగులఁ గడుఁ బొగడేరు ॥ అమ ॥
Pallavi
Amarāṅgana lade yāḍēru
pramadambuna nade pāḍēru
Charanams
1.Garuḍavāhanum̐ḍu kanakarathamupai
yiravuga vīdhula nēm̐gīni
suralunu munulunu sompuga mōm̐kula
teralici teralici tīsēru
2.Yiladharum̐ḍadivō yindrarathamupai
kelayucu dikkulu gelicīni
balu śēṣādulu brahmaśivādulu
celam̐gi sēvalaṭu sēsēru
3.Alamēlmaṅgato naṭu śrīvēṅkaṭa
nilayum̐ ḍaradamuna negaḍīni
nalugaḍa muktulu nāradādulunu
polupu migulam̐ gaḍum̐ bogaḍēru
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.