Main Menu

Ammavaru Nayyavaru (అమ్మవారు నయ్యవారు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 299 | Keerthana 293 , Volume 9

Pallavi: Ammavaru Nayyavaru (అమ్మవారు నయ్యవారు)
ARO: Pending
AVA: Pending

Ragam: Hindola vasamtam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ammavaru Nayyavaru | అమ్మవారు నయ్యవారు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మవారు నయ్యవారు నండనె కూచున్నవారు
యిమ్ముల నిద్దర జాణ లేమందమే       ॥ పల్లవి ॥

కొల్లున నవ్వీ నతఁడు గుట్టున నున్నది యాకె
తెల్లవారుదాఁకా మాఁటదిద్దనె పట్టె
పల్లద మాతనివంక పంతము లీచెలివంక
యిల్లిదె యిద్దరూ సరె యేమందమే      ॥ అమ్మ ॥

తొక్కుఁ బాదము లతఁడు తొరలి పెనఁగు నీకె
చెక్కులు నొక్కి బుద్దులు చెప్పనె పట్టె
మొక్కల మాతనిపాలు మురిపె మీసతిపాలు
యెక్కెఁజల మిద్దరికి నేమందమే        ॥ అమ్మ ॥

చేతులు చాఁచు నతఁడు సిగ్గుననుండు నీకె
యీతల విడే లిద్దరి కియ్యనె పట్టె
ఆతఁడు శ్రీవెంకటేశుఁ డలమేలుమంగయింతి
యేతుల నిద్దరూఁ గూడి రేమందమే      ॥ అమ్మ ॥


Pallavi

Am’mavāru nayyavāru naṇḍane kūcunnavāru
yim’mula niddara jāṇa lēmandamē

Charanams

1.Kolluna navvī natam̐ḍu guṭṭuna nunnadi yāke
tellavārudām̐kā mām̐ṭadiddane paṭṭe
pallada mātanivaṅka pantamu līcelivaṅka
yillide yiddarū sare yēmandamē

2.Tokkum̐ bādamu latam̐ḍu torali penam̐gu nīke
cekkulu nokki buddulu ceppane paṭṭe
mokkala mātanipālu muripe mīsatipālu
yekkem̐jala middariki nēmandamē

3.Cētulu cām̐cu natam̐ḍu siggunanuṇḍu nīke
yītala viḍē liddari kiyyane paṭṭe
ātam̐ḍu śrīveṅkaṭēśum̐ ḍalamēlumaṅgayinti
yētula niddarūm̐ gūḍi rēmandamē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.