Main Menu

Anni kalgiyu mirurakunna ne nevari (అన్ని కల్గియు మీరూరకున్న)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kalyani

Arohana :S R2 G3 M2 P D2 N3 S
Avarohana :S N3 D2 P M2 G3 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| అన్ని కల్గియు మీరూరకున్న నే నెవరి వాడనౌదు రామ ||

అనుపల్లవి

|| కన్నతండ్రివలె రక్షించుటకును కరుణయేల రాదు రామ ||

చరణములు

|| అక్షయమియ్యగ దలచిన శ్రీ మహా | లక్ష్మీదేవి లేదా రామా |
రక్షింపగ నెంచిన భూదేవియు | రత్నగర్భ గాదా రామా ||

|| పక్షపాత మెడలింపగ చేతిలొ | పరుసవేది లేదా రామా |
ఈ క్షణమున దయగలిగిన సంచిత | ధనమున్నది కాదా రామా ||

|| కనుగొని నిర్హేతుక కౄప జూచిన | కల్పతరువు లేదా రామా |
మనవాడని నెనరుంచిన చింతా | మణి యున్నది కాదా రామా |

|| పెనబడు వెత దీర్పను శరణాగత | బిరుదు గాదా రామా |
వనజ భవాండము లేలు దొరలు | దేవర వారలె కాదా రామా ||

|| కరిప్రహ్లాద విభీషణాదులను | గాచితివని వింటి రామా |
హర సుర బ్రహ్మాదులకంటెను నిను | అధికుడవనియుంటి రామా ||

|| సిరి నాయక నీ మరుగు జొచ్చితిని | శరణంటిని రామా |
కరుణతో భద్రాద్రి రామదాసుని | కావు మనియంటి రామా ||

.


Pallavi

|| anni kalgiyu mIrUrakunna nE nevari vADanaudu rAma ||

Anupallavi

|| kannataMDrivale rakShiMcuTakunu karuNayEla rAdu rAma ||

Charanams

|| akShayamiyyaga dalacina SrI mahA | lakShmIdEvi lEdA rAmA |
rakShiMpaga neMcina BUdEviyu | ratnagarBa gAdA rAmA ||

|| pakShapAta meDaliMpaga cEtilo | parusavEdi lEdA rAmA |
I kShaNamuna dayagaligina saMcita | dhanamunnadi kAdA rAmA ||

|| kanugoni nirhEtuka kRupa jUcina | kalpataruvu lEdA rAmA |
manavADani nenaruMcina ciMtA | maNi yunnadi kAdA rAmA |

|| penabaDu veta dIrpanu SaraNAgata | birudu gAdA rAmA |
vanaja BavAMDamu lElu doralu | dEvara vArale kAdA rAmA ||

|| kariprahlAda viBIShaNAdulanu | gAcitivani viMTi rAmA |
hara sura brahmAdulakaMTenu ninu | adhikuDavaniyuMTi rAmA ||

|| siri nAyaka nI marugu joccitini | SaraNaMTini rAmA |
karuNatO BadrAdri rAmadAsuni | kAvu maniyaMTi rAmA ||
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.