Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 15; Volume No. 3
Copper Sheet No. 203
Pallavi: Annita Napalitiki (అన్నిటా నాపాలిటికి)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
||అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు | ఎన్నికగా తుది పదమెక్కితిమి మేలు ||
Charanams
||కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు- | చెంది కొందరు అట్టే సంతసించినా మేలు |
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు | పొందుగా కొందరు నన్ను పొగడినా మేలు ||
||కోరి నన్ను పెద్దసేసి కొందరు మొక్కినా మేలు | వేరె హీనుడని భావించినా మేలు |
దూరిమి కొందరు నన్ను గూడుకుండినా మేలు | మేరతో విడిచి నన్ను మెచ్చుకున్నా మేలు ||
||ఇప్పటికి గలపాటి యెంత పేదయినా మేలు | ఉన్నతిల్లు సంపద నాకుండినా మేలు |
ఎప్పుడు శ్రీవేంకటేశుకే నిచ్చిన జన్మమిది | తప్పు లేదాతనితోడి తగులమే మేలు ||
.
Pallavi
||anniTA nApAliTiki hariyAtaDE kalaDu | ennikagA tudi padamekkitimi mElu ||
No comments yet.