పద్యం:
చపలాత్ము డవని లోపల
నపాత్ర జనులకును దాన మందిచ్చుట హీ
నపు గుక్క నోటి లోపల
నిపుణత నెయిపోసినట్లు నెగడు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ భూమియందు చంచల స్వభావులైనవారు అయోగ్యులైన ప్రజలకు దానము చేయుట నీచమైన కుక్కనోట్లో నేతిని పోసిన విధముగానగును.యోగ్యా యోగ్యతలను తెలిసి పాత్రాపాత్రదానము చేయవలెను.దానినిబట్టే ప్రయోజప్రయోజనములు కలుగును.
.
Poem:
Chapalaathmu Davani lopala
Napaatra janulakunu daana mamdichchuta hee
Napu gukka noti lopala
Nipunata neyiposinatlu negadu kumaaraa.
.
chapalaatmu Davani lOpala
napaatra janulakunu daana maMdichchuTa hee
napu gukka nOTi lOpala
nipuNata neyipOsinaTlu negaDu kumaaraa.
.
No comments yet.