Main Menu

Narasimha Nee Dhivyanaamamantramuchetha (నరసింహ నీ దివ్య నామమంత్రముచేత)

Composer: Kakutsam Seshappa Kavi (కాకుత్థ్సం శేషప్పకవి) belong to 1800 AD. He belonged to Dharmapuri region in the current state of Telangana, India. He was a poet who dedicated his life to Lord Narasimha Swamy.More...

Poem Abstract:

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
దురితజాలము లన్ని – దోలవచ్చు
నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
బలువైన రోగముల్ – పాపవచ్చు
నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ – రింపవచ్చు
నరసింహ | నీ దివ్య – నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల – దరమవచ్చు

తే. భళిర | నే నీ మహామంత్ర – బలముచేత
దివ్య వైకుంఠ పదవి సా – ధింపవచ్చు
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!నీ పవిత్రనామమంత్రముచే సమస్త పాపములను పోగొట్టవచ్చును. దీర్ఘవ్యాధులు నివారించవచ్చు. శత్రు సమూహములను జంపవచ్చు. యమభటులను దరమవచ్చు! ఓహొ! నీ నామమంత్రమహిమచే గొప్పదైన వైకుంఠము నందు బదవిని బొందవచ్చు. అహా!ఏమని చెప్పదును? నీ నామమంత్ర మహిమచే సాధింపలేని కార్యము లేదు.
.


Poem:
See. Narasimha | Nee Divya – Naamamamtramucheta
Duritajaalamu Lanni – Dolavachchu
Narasimha | Nee Divya – Naamamamtramucheta
Baluvaina Rogamul – Paapavachchu
Narasimha | Nee Divya – Naamamamtramucheta
Ripusamghamula Samha – Rimpavachchu
Narasimha | Nee Divya – Naamamamtramucheta
Damdahastuni Bamtla – Daramavachchu

Te. Bhalira | Ne Nee Mahaamamtra – Balamucheta
Divya Vaikumtha Padavi Saa – Dhimpavachchu
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. narasiMha | nee divya – naamamaMtramuchEta
duritajaalamu lanni – dOlavachchu
narasiMha | nee divya – naamamaMtramuchEta
baluvaina rOgamul – paapavachchu
narasiMha | nee divya – naamamaMtramuchEta
ripusaMghamula saMha – riMpavachchu
narasiMha | nee divya – naamamaMtramuchEta
daMDahastuni baMTla – daramavachchu

tE. bhaLira | nE nee mahaamaMtra – balamuchEta
divya vaikuMTha padavi saa – dhiMpavachchu
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

2 Responses to Narasimha Nee Dhivyanaamamantramuchetha (నరసింహ నీ దివ్య నామమంత్రముచేత)

  1. KIRAN October 25, 2015 at 8:17 am #

    can’t we get a picture image of Sheshappa Kavi…

  2. Rani November 11, 2022 at 7:46 pm #

    Recite padhyam

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.