
Gollapudi columns ~ Naadayogi Jnaanapakaalu (నాదయోగి జ్ఞానపకాలు)
‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. కొందరు గొప్పతనాన్ని భుజకీర్తుల్లాగ అలంకరిం చుకుని ఊరేగుతుంటా రు. మరికొందరు మంచి నీళ్ల సెలలాగ వ్యాపించి, పలకరించిన వారికి దప్పి క తీరుస్తూ, హృదయంలో ‘చెమ్మ’ని ఆర్ద్రంగా పంచు తూ ప్రయాణం చేస్తూం టారు. అలాంటి రెండో కోవకు చెందిన మనుషుల్లో మొదటిస్థానంలో నిలిచేవారు నేదునూరి […]

Gollapudi columns ~ Musugullo nayakulu (ముసుగుల్లో నాయకులు)
ఈ మధ్య షూటింగుకి రాజమండ్రికి వచ్చాను. అక్కడ ప్రతీ వీధి జంక్షన్‌లోనూ కనిపించిన దృశ్యం నాయకుల విగ్రహాల మీద ముసుగులు. మా మిత్రుడిని అడిగాను -కారణమేమిటని. ఎన్నికల నిబంధనలు -అన్నాడాయన. పాపం, మన నాయకులు -తమ ప్రచారానికి విగ్రహాల్ని ప్రతిష్టించారు. ఎన్నికల సంఘం వారి మీద ముసుగులు దించింది -ప్రతీ వీధిమొగలో వారిని చూస్తే వోటరుకి వారికి ఓటు వేయాలని అనిపిస్తుందేమోనని వారి ఆలోచన అయివుంటుంది. కాని నేనంటాను -మరో విధంగా ఆలోచిస్తే ‘వీరే మా కొంపలు […]

Gollapudi columns ~ Mr̥tyuhela (మృత్యుహేల)
ఫాస్ట్ బౌలర్ 150 కి.మీ వేగంతో విసిరే బంతి సెకనులోపే 22 గజాలు ప్రయాణం చేస్తుంది. బంతి వేగానికి, మనిషి నిశిత దృష్టికి మధ్య క్షణంలో ఏర్పడిన తేడాయే హ్యూస్‌ని ఆటకూ, జీవితానికీ దూరం చేసింది. మృత్యువు ఆట. లేదా ఆటలో మృత్యువు. దాదాపు 300 ఏళ్ల కిందట ప్రముఖ బ్రిటిష్ రచయిత డేనియల్ డెఫో ‘‘మాన్ ఫ్రైడే’’ అనే నవల రాశాడు. సరిగ్గా 254 సంవత్స రాల తర్వాత ఆడ్రియన్ మిచల్ అనే నాటక రచయిత […]

Gollapudi columns ~ Miriyala picikari..! (మిరియాల పిచికారీ..!)
చాలా కష్టపడి ఃపెప్పర్ స్ప్రేఃకి ఈ తెలుగు అనువాదం చేశాను. గత శతాబ్దంలో మన దేశానికి వచ్చిన వ్యాపారస్థులందరూ ఈ సుగంధ ద్రవ్యాలనే రవాణా చేసుకున్నారు తమ తమ దేశాలకి. మన దేశంలో మిరపకాయలు లేవు. కారం లేదు. గ్రీసు వంటి దేశాల నుంచి దరిమిలాను వచ్చాయని చెప్పుకుంటారు. మళ్లీ ఆనాటి మిరియాలకి జాతీయమైన ప్రతిష్టని ఈనాడు పెంచిన ఘనత లగడపాటి రాజగోపాల్‌గారిది. లోక్‌సభలో మైకులతో కొట్టుకోవడం చూశాం. తిట్టుకోవడం చూశాం. కాగితాలు చింపడం చూశాం. ఈ […]

Gollapudi columns ~ Mannci polisu – ceddapolisu (మంచి పోలీసు – చెడ్డపోలీసు)
మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు – చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆట. రోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళే మోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడు. నెలాఖరు రోజులు. బేరం ప్రారంభమవుతుంది. అలాక్కాక – అవతలి మనిషి ఏ మంత్రిగారి వియ్యంకుడో, ఎమ్మెల్యే గారి బావమరిదో అయితే ఈ పోలీసు ఇరుకులో పడతాడు. అప్పుడేమవుతుంది? మరో పోలీసు రంగంలోకి దూకుతాడు. ఇతను తప్పనిసరిగా మంచి పోలీసు అయివుంటాడు. రాగానే పాసింజరుకి నమస్కారం చేస్తాడు. […]

Gollapudi columns ~ Tragic Hero(ట్రాజిక్ హీరో)
ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’ అని ఎ. రాజా నెలల తరబడి గొంతుచించు కున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్నవారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి. రాజకీయ రంగంలో పదవికీ, అధికారానికీ మధ్య చిన్న దు ర్మార్గం ఉంది. పదవిలో పని చేస్తే డబ్బు వర్షం కురుస్తుంది. విచిత్రం, ఏమీ చెయ్యకపోవ డం వల్ల కూడా డబ్బు వర్షం కురుస్తుంది. రెండో పని తన చుట్టూ జరుగుతూంటే కళ్లు […]

Gollapudi columns ~ The Last Mughal(ది లాస్ట్ మొఘల్)
నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్తత్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్‌బోయిస్‌తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. భారతీయ సినీ ప్రపంచంలో మరో రామానాయుడు ఉండరు. ఇది చాలా తేలికగా అని పించే మాటగా చాలామందికి కనిపించవచ్చు కాని- ఆ ప్రత్యే కతని ఒక జీవితకాలం కేవలం పరిశ్రమతో, చిత్తశుద్ధితో నిరూ పించుకున్న వ్యక్తి రామానా యుడుగారు. సినీమా రంగానికి ఏ […]

Gollapudi columns ~ Sadguruvula Astamayam(సద్గురువుల అస్తమయం)
ఆయన ముందు కూర్చుని, ఆయన మాట విని లేచాక భారతీయుడినైనందుకు, అంతటి సద్గురువుల నుంచి అన్ని సత్యాలను ఎరిగినందుకు వొళ్లు పులకిస్తుంది. ఆయన నిజమైన సద్గురువు. రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు చెప్పలేదు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ లేదు. తాయెత్తులు కట్టలేదు. మంత్రాలు వెయ్యలేదు. కాని అత్యంత హృద్యమైన రీతిలో ఏంత్రోపాలజీ, చరిత్ర, మాన వ సంస్కృతి, ధర్మనిరతి, సం ప్రదాయ ఔచిత్యం, జీవనసరళి-ఇన్నింటినీ సమన్వ యించి ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతివ్యక్తికీ అందే మా ర్గంలో […]

Gollapudi columns ~ Malli avinitiki peddapita (మళ్ళీ అవినీతికి పెద్దపీట)
ఈ దేశంలో రాజకీయ నాయకుడు అన్నిటికీ తెగించి అయినా ఉండాలి లేదా వోటరు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అనయినా అనుకొని ఉండాలి. వోటరు కన్ను కప్పి ఏపనయినా చెయ్యవచ్చుననే కుత్సితపు ధీమాతో ఉండి ఉండాలి. లేదా వోటరుకి మరో గతి లేదన్న అలసత్వమయినా పెంచుకుని ఉండాలి. ఈ వ్యవస్థ బలహీనతల్ని కాచి వడబోసి అయినా ఉండాలి. లేదా ప్రజలు గతాన్ని సుళువుగా మరిచిపోతారులే -అన్న మొండి ధైర్యాన్నయినా పెంచుకుని ఉండాలి. రాజకీయ నాయకుడు సమాజ వంచనని అసిధారా […]

Gollapudi columns ~ Kasi mamayyalu! (కాశీ మామయ్యలు!)
ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -‘కనబడుటలేదు’ అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ”మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి… గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును” -ఇదీ ప్రకటన. చక్కని హాస్యం, ఎక్కువ కడుపుమంట ఉన్న మహానుభావులు ఇలా వీధిన పడ్డారు. ఎలాగూ -ఈ నాయకుల పుణ్యమా అని తమకు దరిద్రం తప్పలేదు […]